Ememi Puvvoppune Gowramma - Bathukamma Song Telugu Lyrics
![]() |
Image Credits : Folk Songs { Youtube } |
Eemeemi Poovappunee Gowramma Bathukamma Song Lyrics
ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ
ఏమేమి కాయప్పునే
తంగేడు పువ్వోప్పునే గౌరమ్మ
తంగేడు కాయప్పునే
తంగేడు పువ్వులో తంగేడు కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో
ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ
ఏమేమి కాయప్పునే
తెలుగంటి పువ్వోప్పునే గౌరమ్మ
తెలుగంటి కాయప్పునే
తెలుగంటి పువ్వులో తెలుగంటి కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో
ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ
ఏమేమి కాయప్పునే
ఉమ్మెత్త పువ్వోప్పునే గౌరమ్మ
ఉమ్మెత్త కాయప్పునే
ఉమ్మెత్త పువ్వులో ఉమ్మెత్త కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో
ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ
ఏమేమి కాయప్పునే
జిల్లేడు పువ్వోప్పునే గౌరమ్మ
జిల్లేడు కాయప్పునే
జిల్లేడు పువ్వులో జిల్లేడు కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో
ఏమేమి పువ్వోప్పు నే గౌరమ్మ
ఏమేమి కాయప్పునే
మందార పువ్వోప్పునే గౌరమ్మ
మందార కాయప్పునే
మందార పువ్వులో మందార కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో
ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ
ఏమేమి కాయప్పునే
గుమ్మడి పువ్వోప్పునే గౌరమ్మ
గుమ్మడి కాయప్పునే
గుమ్మడి పువ్వులో గుమ్మడి కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో
ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ
ఏమేమి కాయప్పునే
గన్నేరు పువ్వోప్పునే గౌరమ్మ
గన్నేరు కాయప్పునే
గన్నేరు పువ్వులో గన్నేరు కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో